కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ రియల్ ఎస్టేట్ బాధితుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారె వెంకటేష్
ముషీరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ సంస్థల మోసాల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని, వెంచర్ల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ బాధితుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారె వెంకటేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం దోమలగూడలోని రాష్ట్ర కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ అథారిటీ రేరా చట్టం కొనుగోలుదారులకు రక్షణ కోసం అన్నారు.
సంప్రదించిన తర్వాతనే వినియోగదారులు కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు సంస్థలు ప్రకటిస్తున్న ఫ్రీ లాంచింగ్ బై బ్యాక్ 50% డిస్కౌంట్ తదితర ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఆయన కొనుగోలుదారులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఓ ఆర్ ఆర్ చుట్టూ నిత్యం కొత్త కొత్త రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుకొస్తున్నాయని వీరి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు సంపూర్ణ జ్యోతి అనిత శోభ మహేశ్వరి కమల రాజ్యలక్ష్మి మానస తదితరులు పాల్గొన్నారు.






