పోచారానికి క్యాబినెట్ హోదా
21-08-2024 05:50 AM
- ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా మాజీ స్పీకర్
- డెయిరీ కో ఆపరేటివ్ చైర్మన్‌గా గుత్తా అమిత్‌రెడ్డి
హైదరాబాద్/కామారెడ్డి, ఆగస్టు 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసింది. అందులో భాగంగా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంగళవారం తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమించి క్యాబినేట్ హోదా కల్పించారు. అదేవిధంగా గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరుపున సీటు ఆశించి భంగపడ్డ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయు డు గుత్తా అమిత్‌రెడ్డికి తెలంగాణ డెయిరీ కో ఆపరేటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.






