ధరణి దరఖాస్తులను పది రోజుల్లోపు పరిష్కరించాలి
- 23, 24 తేదీల్లో నూతన రెవెన్యూ చట్టం
- ముసాయిదాపై జిల్లాల్లో వర్క్ షాప్‌లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (విజయక్రాంతి): ధరణిలో సమస్యలపై స్వీకరించిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటం పై మంత్రి కలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాలు, నూతన రెవెన్యూ చట్టం -2024 ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్‌ఆర్‌ఎస్ త దితర అంశాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరణి సమ స్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చి న దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అలాగే తిరస్కరించిన దర ఖాస్తులకు సరైన కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని కలెక్టర్లకు సూచిం చారు. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని, ఈ మూడు జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.
రాష్ర్ట ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూత న రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై ప్రజల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ము సాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలె క్టర్లను ఆదేశించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి...
రాష్ర్టంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండ తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. రాను న్న ఐదు రోజుల వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థ లకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్ట ర్లు తీసుకోవాలన్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా చూడాలన్నారు. వర్షాలపై రాష్ర్టంలో ని వివిధ జిల్లాల్లో పరిస్థితిపై మంత్రి కలెక్టర్లతో చర్చించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై దృష్టి పెట్టండి
ఎల్‌ఆర్‌ఎస్‌పై జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లను ఆదేశించారు. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యుల రైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్‌లతో పాటు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేసుకోవాలన్నారు. అలాగే మొత్తం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వని పక్షంలో ఇప్పుడు తీసుకుని ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో వంద ఎల్ ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఇందులో ఎదురయ్యే మంచి చెడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకో వాలని అధికారులకు మంత్రి సూచించారు.
గత ప్రభుత్వం 2020 లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం సుమారు 25 లక్షల దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకో లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.






