calender_icon.png 20 August, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు స్తంభాలపైనున్న కేబుల్ వైర్లను తొలగించాలి

20-08-2025 12:00:00 AM

 విద్యుత్‌శాఖ ఖమ్మం ఎస్‌ఈ

ఖమ్మం, ఆగస్ట్ 19 (విజయ క్రాంతి): కరెంటు స్తంభాలపై కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ కి సంబంధించిన వారు వైర్లను ఇష్టాను రీతిలో అమర్చారని, గుట్టలుగా ఉన్న వైర్లను వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాస చారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి 16 సర్కిళ్ల పరిధిలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని, స్తంభాల పై పద్ధతి ప్రకారం లేని కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారని ఎస్ ఇ తెలిపారు.

ప్రజల ప్రాణాలు ప్రాముఖ్యత దృశ్య కేబుల్ ఆపరేటర్లకు గతంలో కూడా మీటింగ్ లు పెట్టి తెలిపామని, కొన్ని స్తంభాలు చాలా ఇబ్బందికరంగా వైర్లతో ఉన్నాయని వెంటనే కేబుల్ వైర్లను తొలగించాలని అన్నారు. ఈ కేబుల్ వైర్ల వల్ల కొన్ని ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ ఇ తెలిపారు.

అదేవిధంగా రానున్న వినాయక చవితికి, దసరాకి విగ్రహాల తరలింపులో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎస్ ఇ బృందం ఖమ్మంలో వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాల వద్ద  పరిశీలించి పలు సూచనలు చేశారు.