పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్
07-04-2026 04:27 PM
కల్లూరు,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన “పీపుల్స్ మార్చ్” పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కల్లూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, కల్లూరు మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన భట్టి విక్రమార్క సేవలను నాయకులు ప్రశంసించారు.




