ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు
మానకొండూరు,(విజయక్రాంతి): ఆత్మీయ ఆలంబనాలు, కరచాలనాలు, అభిమానం ఉప్పొంగగా శాలువా కప్పి, గజమాలతో సత్కారాలు, పార్టీ శ్రేణుల అభిమానుల శుభాకాంక్షల వెల్లువల మధ్య కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీఆర్ 53 వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. చాయాచిత్రాల సందడి, అభిమానుల శుభాకాంక్షలు వెల్లువలో జీవీఆర్ తడిసి ముద్దయ్యారు. నియోజకవర్గం కేంద్రమైన మానకొండూరులోని బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జీవీఆర్ నివాసం పుట్టినరోజు వేడుకలకు వేదికైంది.
జిల్లా, నియోజకవర్గ, మండల, స్థాయి పార్టీ నేతలు ఉదయం నుండి జీవీఆర్ నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో, రామకృష్ణారావు నివాసం సందడిగా మారింది. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గజమాలతో రామకృష్ణారావును సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పేరుపేరునా ఆప్యాయత పలకరింపులతో జీవీఆర్ తన పుట్టినరోజుకు తరలివచ్చి న పార్టీ శ్రేణులకు, అభిమానులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా, సోషల్ మీడియాలో, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.




