రాష్టానికి వరుసగా కాంగ్రెస్ అగ్రనేతల క్యూ
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేతలు తెలం గాణ బాటపట్టారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ నాలుగైదు సార్లు రాష్ట్రానికి రాగా, గురువారం మరోసారి రానున్నారు. నేటి సాయంత్రం 4 గంటల కు నర్సాపూర్, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్‌లో నిర్వహించే జన జాతర సభలకు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునఖర్గే శుక్రవారం ప్రచారంలో పాల్గొననున్నా రు. మధ్యా హ్నం 12 గంటలకు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అనంతరం సాయంత్రం 4 గంటలకు నకిరేకల్ జన జాతర సభకు హాజరవుతారు. అదే రోజు రేవంత్‌రెడ్డి ఉదయం 10 గంటలకు పఠాన్‌చెరులో, సాయంత్రం 4 గంటలకు మక్తల్, సాయంత్రం 6 గంట లకు షాద్‌నగర్‌లో నిర్వహించే కార్న ర్ మీటింగ్‌లకు హాజరుకానున్నారు. 11న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఉదయం 11 గంటలకు కామారెడ్డి, మధ్యాహ్నం 1 గంటలకు తాండూర్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.






