మెరుగైన వైద్యం కోసమే శిబిరాలు
- మున్సిపాలిటీలో పారిశుధ్య పనులపై దృష్టి సారించాలి
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుతున్నా యని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపులో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన సందర్శించారు.
రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించి, చికిత్స వివరాలపై ఆరా తీసి వైద్యులకు పలు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి నూతన గృహ ప్రవేశాం చేశారు. అనంతరం పలు వార్డులో కొనసాగుతున్న శానిటేష న్ పనులను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యంగా క్యాం పులలో గుర్తించిన రిఫరల్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు సూచించారు.
దంతన్పల్లి పిహెచ్సిలో గుర్తించిన 10 మంది కంటి వ్యాధిగ్రస్తులలో 5 మందికి రిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా ఆపరేషన్లు చేయిం చినట్లు గుర్తు చేశారు. అదే విధంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణ కోసం ఇప్పటికే టెండ ర్లు పూర్తయ్యాయని, మరో 5-6 రోజుల్లో అదనపు కార్మికులు అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచడానికి సిఎస్‌ఆర్ నిధులతో మరిన్ని స్వచ్ఛ ఆటోలను సమకూర్చు తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు మౌనిక, మెహబూబ్, సుచిత, జ్యోతి, నర్మదా, వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, కాలనీవాసులు లబ్ధిదారులు పాల్గొన్నారు.




