21 March, 2026 | 6:11 PM

పేద విద్యార్థుల కలలకు ఇఎల్‌వీ భాస్కర్ ఫౌండేషన్ సహకారం

21-03-2026 12:47 AM

ఉచిత ఎంసెట్, నీట్ కోచింగ్ సెంటర్

ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ 

డాక్టర్ ఇరుగుదిండ్ల భాస్కర్

చౌటుప్పల్, మార్చి 20 : ఇంటర్మీడియట్ పూర్తయిన గ్రామీణ నిరుపేద విద్యార్థిని విద్యార్థులు తమ కలలను సహకారం చేసుకునేందుకు ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడపల్లి రోడ్డులో గల ఇఎల్‌వి భాస్కర్ ఫౌండేషన్ కార్యాల యంలో ఉచిత ఎంసెట్, నీట్ కోచింగ్ సెంటర్‌ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డా.భాస్కర్ మాట్లాడుతూ నా చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులకు దూరమైన నేను 20 సంవత్సరాల ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని నిర్మాణ, వ్యాపార రంగాలలో రాణించి ఈరోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. నిరుపేద కుటుంబంలోని విద్యార్థినీ విద్యార్థులు హైదరాబాదులో ఫీజులు చెల్లించి ఎంసెట్, నీట్ కోచింగ్ తీసుకోలేరని పేదరికం కారణంగా వారి పై చదువులకు ఎలాంటి ఆటంకాలు కలుగ కాకూడదనే ఉద్దేశంతో ఈ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించి మీ తల్లిదండ్రులకు,కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రతి విద్యార్థికి ఒక బుక్ లేట్ అందిస్తానని ఆ బుక్ లెట్ లో ఇంటర్ తర్వాత ఏ కోర్సులు ఉంటాయి, ఏ రంగం వైపు పయనించాలనే వివరాలు అందులో ఉంటాయని అన్నారు. ఎంసెట్,నీట్ పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు పై స్థాయిలో వెళ్లేందుకు తమ సహకారం తప్పకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి,2వ వార్డ్ కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, 16వ అవార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాస్, 18వ వార్డ్ కౌన్సిలర్ బుడ్డ సురేష్, విద్యార్థినీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.