3 July, 2026 | 8:36 PM

Breaking News

అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •  

కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

06-06-2025 10:51 PM

కోదాడ: స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. స్టార్ టెక్ కంపెనీ, హైదరాబాద్ వారు ఈ రోజు నిర్వహించిన 06.06.2025 న ప్రాంగణ ఎంపికలో  17 మంది సెలెక్ట్ అయ్యారని తెలిపారు. సెలెక్ట్ అయిన వారికి వార్షిక వేతనం 3.0 లక్షలు ఉంటుందని కంపెనీ హెచ్.ఆర్ వినయ్ మరియు విద్య సాగర్ తెలిపారు. ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అభినందించడం జరిగింది. ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందించారు. ఈ ప్రాంగణ ఎంపికలకు సెలెక్ట్ కావడానికి కృషి చేసిన ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ ఏజాజ్, రమేష్, నరేష్ రెడ్డి అధ్యాపక మిత్రులను అభినందించడం జరిగింది.