27 February, 2026 | 1:47 AM

మెట్లు ఎక్కగలవా? ఠాణా దాట గలవా!

27-02-2026 12:04 AM
  1. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల కోసం గుడ్డిగా ప్రభుత్వ భవనాల ఎంపిక

మెట్లు లేకుండా మొదటి అంతస్తులోని డిస్పెన్సరీని చేరుకునేదెలా?

వారాసిగూడ ఠాణాపై డిస్పెన్సరీ.. బెంబేలెత్తుతున్న ఈఎస్‌ఐ లబ్ధిదారులు

ఎంపిక చేసిన భవనాలన్నింటిలోనూ ఏదో ఒక సమస్య

మార్చి 1 నాటికి 29 డిస్పెన్సరీలను తరలించాలనే ఉత్తర్వులతో ఉద్యోగుల వెతలు

కమ్యూనిటీ హాళ్లలోకి డిస్పెన్సరీల తరలింపుపై స్థానికుల ఆగ్రహావేశాలు.. అడ్డుకునే అవకాశం

పక్క చిత్రంలోనివి..

ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్ర మే. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 29 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ప్రస్తుతం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటి అద్దెలు కట్టలేక.. ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో భాగంగా చిలుకలగూడ, మౌలాలి ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను కూడా వివిధ ప్రాం తాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలోకి మార్చారు.

అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అధికారులు మర్చిపోయినట్టున్నారు. కమ్యూనిటీ హాళ్లలో ఇప్పటివరకు స్థానిక ప్రజలు సమావేశాలు, చిన్నచిన్న ఫంక్షన్లను నిర్వహించుకునేవారు. ఇప్పుడు అవకాశం లేకుండా పోతోందని ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. 29 డిస్పెన్సరీలను మార్చాలంటూ.. ఉత్తర్వులు జారీకావడంతో ఆయా డిస్పెన్సరీల వైద్యు లు, అధికారులు, సిబ్బది వెళ్లి కేటాయించిన భవనాలను పరిశీలించి వచ్చారు. ఒక్కో చోట ఒక్కో రకమైన సమస్యలు వారికి కనిపించాయి.

అన్నీ సమస్యలే..

మౌలాలి ఈఎస్‌ఐ డిస్పెన్సరీని తరలిస్తున్న కమ్యూనిటీ హాలులో మొదటి అంత స్తుకు వెళ్లాలంటే పూర్తిస్థాయిలో మెట్లు లేవు. చిలుకలగూడ డిస్పెన్సరీని బౌద్ధనగర్ కమ్యూనిటీ హాలు (వారాసిగూడ)కు మా ర్చారు. కింగ్‌కోఠిలోని బడీచౌడిలో ప్రభుత్వ భవనాన్ని కనుగొనాలంటే.. అక్షాంశాలు, రేఖాంశాలే దిక్కు. ఎందుకంటే ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే సరైన అడ్రస్ దొరక్కపోతే.. పని కివస్తుందనే ఉద్దేశంతో అక్షాంశాలు, రేఖాంశాలను పొందుపర్చారు.

మిగతా ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలోనూ అనేక సమస్యలు నెలకొన్నాయి. కొన్నింటికి తలుపులు, కిటికీలుకూడా లేవు. మరికొన్ని చోట్ల టాయిలెట్లు లేవు. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంది. ఇంకొన్ని ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, వార్డు ఆఫీసులు, బస్తీ దవాఖానల విషయంలో గదులు చాలా ఇరుకుగా, చిన్నగా ఉన్నాయి. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లోని సమానంతా ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదని సిబ్బంది, అధికారులు, వైద్యులు వాపోతున్నారు. పైగా ఫార్మసీ, ల్యాబ్, వైద్యులు, చికిత్స గది లాంటివి ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియక తలలు బాదుకుంటున్నారు.

పైగా కొన్ని చోట్ల మొత్తంగా ఒకే హాలు ఉంది. దీనిలోనే అన్నీ సర్దుబాటు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో తెల్లమొహాలేసుకోవడం సిబ్బంది వంతయ్యింది. మరికొన్ని చోట్ల చుట్టూ గోడలే ఉన్నాయి. కనీసం గాలి, వెలుతురు రాని పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. రోగులు చికిత్స తరువాత ఇలాంటి చీకటి గదుల్లో చికిత్సకోసం వస్తే.. లేని రోగాలు వస్తాయేమో అనే భయం కలుగుతుందని, ఇక తాము ఎలా విధులు నిర్వర్తించాలని ఉద్యోగులు అంటున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే..

వాస్తవానికి ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలోకి మార్చడమనేది స్వాగతించా ల్సిన అంశమే. కానీ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు ఎన్ని అవసరాలున్నాయి? ఎంత సామగ్రి ఉంది? ఎంత విస్తీర్ణంలో భవనం కావాలి? రోగులు రావడానికి అనుకూలంగా ఉందా? వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు, వికలాంగులు రావడానికి అనుకూలంగా ఉందా? అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించి కేటాయించాలి.

కానీ ఇవేమీ పట్టించుకోకుండా.. కేవలం కాగితాలపై ఖాళీ కనపడగానే డిస్పెన్సరీలకు కేటాయంచినట్టు గుడ్డిగా వ్యవహ రించారనే ఆరో పణలు వినపడుతున్నాయి. పైగా మార్చి 1 లోగా తరలించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామనే విధంగా ఆదేశాలు జారీచేయడంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి తగ్గలేక సిబ్బంది, ఈఎస్‌ఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కనీసం కేటాయించిన భవనాల్లో రోగులు, సిబ్బంది, వైద్యులకు అనుకూలంగా ఉండేలా వసతులు కల్పించకుండా ఎకాఎకిన తరలించ డంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర కార్మిక శాఖ ఈఎస్‌ఐ డిస్పెన్సరీల తరలింపుపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మెట్లు లేని భవనంలోకి..

ఈ ఫొటో చూడండి.. మొదటి అంతస్తుకు వెళ్లడానికి పూర్తిస్థాయిలో మెట్లు లేని దృశ్యం మనకు కనపడుతోంది (సర్కిల్‌లో). తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలోని 29 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని నిర్ణయించింది. మార్చి 1 నాటికి డిస్పెన్సరీలకు కేటాయించిన ప్రభుత్వ భవనాల్లోకి మార్చకపోతే కఠినంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత డిస్పెన్సరీలో పనిచేస్తున్న అధికారులు,

సిబ్బందికి హెచ్చరికలు జారీచేసింది. మౌలాలీ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని లాలాగూడలోని కమ్యూనిటీ హాల్ (హనుమాన్‌నగర్)లోకి మార్చాలని ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఆ కమ్యూనిటీ హాలు మొదటి అంతస్తుకు వెళ్లడానికి మెట్లు లేవు. ఇప్పుడు సిబ్బందికేకాదు.. లబ్ధిదారులు, వారి కుటుంబసభ్యులు ఎవరు వెళ్లాలన్నా మెట్లు లేకపోవడంతో గాలిలో వెళ్లాల్సిందే అన్న సెటైర్లు వినపడుతున్నాయి.

వారాసిగూడలో ఠాణా పై అంతస్తులో..

ఈ ఫొటో చూడండి.. వారాసిగూడ పోలీస్‌స్టేషన్ భవనం ఇది. వాస్తవానికి ఇది పోలీసు శాఖకు చెం దిన భవనం కాదు. బౌద్ధనగర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేశారు. ఇప్పు డు ఈ ఠాణాపై అంతస్తులో ఉన్న హాలులోకి చిలుకలగూడ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని తరలించా లంటూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ముందే పోలీస్‌స్టేషన్.. పోలీసులంటేనే భయపడే సమాజం ఉన్న నేపథ్యంలో..

రోగు లు, వికలాంగులు, చిన్నపిల్లలు, వృద్ధు లు, మహిళలు.. చికిత్స కోసం వారాసిగూడ ఠాణాను దాటుకుని పై అంతస్తు లో ఉన్న డిస్పెన్సరీని ఎలా చేరుకుంటారు? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పైగా రోగు లు వివిధ వాహనాల్లో వస్తుంటారు. వాటన్నింటినీ ఈ కమ్యూనిటీ హాలు గేటు లోపలికి రానిస్తారా? పదుల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో రోగులు రోజూ వస్తూ ఉంటే.. పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అనేది భవిష్యత్తులో తేలుతుంది.