15 July, 2026 | 1:26 PM

Breaking News

ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •  

కెనెడాలోని రెండు రైల్ నెట్‌వర్క్ లు బంద్.. అమెరికాపై తీవ్ర ప్రభావం

22-08-2024 03:02 PM

అట్టావా: కెనెడాలోని కీలకమైన రెండు రైల్ నెట్ వర్క్ ల్లో పని చేస్తున్న వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. కెనెడా పసిఫిక్ కన్సాస్ సిటీ సదరన్ సంస్థలు చెందిన 9000 మంది ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికాలోని పరిశ్రమలకు అవసరమైన ముడి సరకుల సరఫరా నిలిచిపోయింది. అమెరికా కెనడా మధ్య రైల్ మార్గంలో ఎగుమతి అయ్యే సరకుల్లో మూడోవంతు ఈ సంస్థలు తరలిస్తాయి. ఫలితంగా అమెరికాలోని వ్యవసాయ, ఆటోమొబైల్, హౌస్ కనస్ట్రక్షన్, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడి సరకుల సరఫరాలో తీవ్ర అవరోధాలు ఏర్పడనున్నాయి. అమెరికా, కెనెడా లు పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కావడంతో  సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం మూడు రోజుల్లో 300 మిలియన్ డాలర్లు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.