calender_icon.png 29 June, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్

10-08-2024 04:47:43 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అన్ని కాలపరిమితుల రుణాలకు పెంపుదల వర్తిస్తుంది. ఆటో, వ్యక్తిగత రుణాలతో సహా చాలావరకూ వినియోగ రుణాలకు ఎంసీఎల్‌ఆర్  ఆధారంగానే వడ్డీ రేట్లు ఉంటాయి.  ఈ వినిమయ రుణాలపై ఒక ఏడాది కాలపరిమితిగల బెంచ్‌మార్క్ ఎంసీఎల్‌ఆర్ 8.95 శాతం నుంచి 9 శాతానికి పెరుగుతుందని కెనరా బ్యాంక్ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.

రెండేండ్ల ఎంసీఎల్‌ఆర్ 5 శాతం పెరుగుదలతో 9.30 శాతానికి, మూడేండ్ల ఎంసీఎల్‌ఆర్ అంతే పెరిగి 9.40 శాతానికి చేరుతుంది. కొత్త రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. రిజర్వ్‌బ్యాంక్ వరుసగా తొమ్మిదోసారి కీలక రెపో రేటును యథాతథంగా అట్టిపెట్టిన నేపథ్యంలో కెనరా బ్యాంక్ రుణ రేట్లను పెంచింది.