calender_icon.png 29 June, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పదవి ఇస్తానంటేనే వచ్చిన అధ్యక్షా..

29-06-2025 02:20:36 AM

ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారడం సహజమే. ప్రస్తుతం ఈ సంప్రదాయం మరింత పెరుగుతున్నది. ఏ పార్టీకి గెలుపు అవకాశాలు, అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అందులోకి జంప్ కావడం ఆనవాయితీగా వస్తు న్నది. అయితే జంప్ అయిన ప్రతి నాయకు డూ ప్రజల కోసం, తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం పరిపాటిగా మారింది.

ప్రతీసారి ఈ తంతును చూసి ఆశ్చర్యపోవడం ప్రజల వంతు అవుతున్నది. వాస్తవానికి ప్రస్తుతం అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌లో కూడా ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో కొందరు మంత్రి పదవి ఇస్తామన్న హామీతో వచ్చిన వారు లేకపోలేదు. కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వారికి మంత్రి పదవి మాత్రం రావడం లేదు.

ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో కూడా కొందరు పదవి ఆశించి భంగపడ్డారు. మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీ లోకి వచ్చానని కొందరు వారి సన్నిహితులతో వాపోతున్నారు. ప్రజలు మాత్రం పదవి కోసం పార్టీ మారడమేంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పదవుల కోసం పార్టీ లు మారి వారు ప్రజల పేరు ఎందుకు వాడుకోవడం అని ప్రశ్నిస్తున్నారు. 

క్రాంతి మల్లాడి