calender_icon.png 2 February, 2026 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు

02-02-2026 12:00:00 AM

నిర్మల్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

నిర్మల్/ఖానాపూర్/కుమ్రం భీం ఆసిఫాబాద్/జైనూర్/సిర్పూర్ (యు), లింగాపూర్, మంచిర్యాల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తి ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెట్ దర్యాప్తు బృం దం నోటీసులు జారీచేసి విచారణ పేరుతో గ్రామాలు చేస్తున్నారని ఆరోపించా రు.

ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నిర్మల్ జి ల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లో భారత రాష్ట్ర సమితి నేతలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పంపుతుందని ప్రజలు దీన్ని కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి మార్కొండ రాము అయ్యన్న గారి రాజేందర్ శ్రీకాంత్ యాదవ్ రిజ్వాన్ ఖాన్ మహమూద్ నజీర్ ఖాన్ తదితరులు ఉన్నారు.

జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల నిరసనలు 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం నిర్మల్ జిల్లాలో బీ ఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై విచారణ పేరుతో వేధింపుల గురిచేడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నట్టు నేతలు వెల్లడించారు నిర్మల్ లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఖానాపూర్‌లోని ఒక రీఛార్జ్ జాన్సన్ నాయ క్ బైంసాలో ఆ పార్టీ నేతలు రమాదేవి గాద విలాస్ లోలం శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణాల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

కేసిఆర్‌పై సిట్ విచారణ నేపథ్యంలో నిరసనలు

జైనూర్/సిర్పూర్ (యు), లింగాపూర్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంద ని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు జైనూర్, సిర్పూర్ (యు),లింగాపూర్ మండలాల్లో బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకోలు, గ్రామస్థాయి నిరసనలు నిర్వహిం చారు. గ్రామగ్రామాన నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గూడమామడ, పట్నాపూర్, శివునూర్, పానపటార్, జామి ని, అడ్డెసార, డబోలి, జండగూడతో పాటు సిర్పూర్ (యు), పుల్లారా, సీతగొంది బాండ ర్, పవర్గూడ,లింగాపూర్ గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఇంతియాజులాల, ధర్మారావు, ఆత్రం శంకర్, భీమ్రావు నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ కక్ష సాధింపుతోనే సిట్ నోటీసులు 

మంచిర్యాల : రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు అందజేసి ఇబ్బందులకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది వారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర థియేటర్, అర్చన టెక్స్ చౌరస్తా, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ముఖరాం చౌరస్తా మీదుగా శ్రీనివాస థియేటర్, మంచిర్యాల రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి ఐబీ చౌరస్తా వరకు మంచిర్యాల మాజీ ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ నాయ కులతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్, ఆసంపల్లి సంపత్ కుమార్, చారి, మండల నాయకులు, సర్పంచ్ లు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కక్ష సాధింపునకు పాల్పడుతున్న కాంగ్రెస్

కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఫోన్ టాపిం గ్ కేసు పేరుతో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీ యాలకు నిదర్శనమని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో నల్ల జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో నాయకులు సరస్వతి, రాపర్తి రవీందర్, బుర్స పోచయ్య, అలి బిన్ హైమద్ ,వెంకన్న, నిసార్, అశోక్, ఖాసిం, రవి, అఖిల్, జాకీర్, ఇమ్రాన్, హకీమ్, నారాయణ, సురేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.