calender_icon.png 5 February, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చీకటి ఒప్పందాలను నిరసిస్తూ నిరసన

05-02-2026 12:54:35 AM

సెక్రటేరియట్ రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ

ముషీరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సెక్రెటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల చీకటి ఒప్పందాలు భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ తెలియజేసే ప్రయత్నాన్ని కుట్ర పూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి రోషి జైస్వాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఆర్ భవ్య, లీగల్ సెల్ చైర్మన్ నిఖిల్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు హరిధర్‌తో పాటు వందలాది మంది యూత్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మ దహ నం చేసేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేస్తుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు.

దిష్టిబొమ్మను తీసుకొని వెళ్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన యూత్ కాంగ్రెస్ నాయకులు, మోడీ దిష్టిబొమ్మను వారి నుండి లాక్కున్నారు. దీనితో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎట్టకేలకు యూత్ కాంగ్రెస్ నాయకులు మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.