calender_icon.png 8 December, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన..

08-12-2025 06:53:18 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సర్పంచ్ అభ్యర్థులతో సోమవారం ఎoపిడివో కార్యాలయంలో సమావేశం జరిగింది. బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్ ఈ సమావేశంలో అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. అభ్యర్థులకు సూచించిన ఎన్నికలను నిబంధనలు ఇలా ఉన్నాయి.

- సాధారణ ప్రవర్తన నియమావలి..

-ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి కూడా ఉన్న వివక్షలను మరింత పెంచేలా, పరస్పర ద్వేషాన్ని సృష్టించేలా లేదా విభిన్న కులాలు, మతాలు, సమాజాలు, లేదా భాషల మధ్య ఉద్రిక్తత కలిగించేలా ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనరాదు.

- ఓట్లు పొందడానికి మతం, సామూహిక భావాలు లేదా కుల భావాలను ప్రస్తావించరాదు.

- దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైన ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా ఉపయోగించరాదు. అభ్యర్థుల వ్యక్తిగత జీవితంపై, అది ప్రజా జీవితానికి సంబంధం లేని విషయమైతే, విమర్శలు చేయరాదు. నిర్ధారణ లేని విషయాలు లేదా సంఘటనల ఆధారంగా ఆరోపణలు చేయరాదు.

- రాజకీయ పార్టీపై చేసే విమర్శలు, ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర పనులకే పరిమితం కావాలి. నిర్ధారణ లేని ఆరోపణలు చేయరాదు. వ్యక్తుల ఇళ్ల ముందు వారి అభిప్రాయం లేదా కార్యకలాపాలకు వ్యతిరేకంగా నిరసనలు, ప్రదర్శనలు లేదా పికెటింగ్ చేయరాదు.

ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తమ అనుచరులను వ్యక్తిగత ఆస్తులలో/ప్రజా ఆస్తులలో యజమాని లేదా సంబంధిత అధికారుల లిఖిత అనుమతి లేకుండా జెండాలు ఏర్పాటు చేయడం, నోటీసులు, పోస్టర్లు, నినాదాలు పెట్టడం, లేదా బ్యానర్లు వేలాడదీయడం వంటి కార్యకలాపాలు చేయడానికి అనుమతించరాదు. అలాగే, ఆ అనుమతి ప్రతిని వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్  జిల్లా ఎన్నికల అధికారికి పంపాలి.

 - ఏ అభ్యర్థి లేదా అతని కార్యకర్తలు ఇతర అభ్యర్థి లేదా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన జెండాలు లేదా అతికించిన పోస్టర్లను తొలగించరాదు లేదా ధ్వంసం చేయరాదు.

- అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యలు నేరాలుగా పరిగణించబడే కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి.

- మతం, కులం లేదా సమాజం పేరుతో ఓటు వేయమని లేదా వేయొద్దని కోరడం, మరియు ఓట్లు కోరేందుకు ఏ మత చిహ్నం ఉపయోగించడం చేయరాదు.

- ముద్రకుడు, ప్రచురణకర్త పేరు, చిరునామా పేర్కొనకుండా ఏ పోస్టర్, పాంఫ్లెట్, లీఫ్‌లెట్, సర్క్యులర్ లేదా ప్రకటనను ముద్రించడం లేదా ప్రచురించడం.

- అభ్యర్థి వ్యక్తిగత ప్రవర్తన లేదా వ్యక్తిత్వానికి సంబంధించిన, అసత్యమైన లేదా నిజం కాదని నమ్మబడే ప్రకటన లేదా వార్తను ప్రచురించడం ద్వారా అతని/ఆమె ఎన్నికల అవకాశాలను దెబ్బతీయడం.

- మరో రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి నిర్వహించిన ఏ ఎన్నికల సమావేశాన్ని అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం.

- క్రింది కాల వ్యవధిలో ప్రాసెషన్లు నిర్వహించడం లేదా ప్రజా సమావేశాలు నిర్వహించడం 

గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ ముగిసే సమయానికి 44 గంటల ముందునుండి చేయకూడని పనులు:

- ఓటర్లకు లంచం ఇవ్వడం లేదా ఏ రూపంలోనైనా బహుమతి ఆఫర్ చేయడం.

- పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓట్లు అడగడం లేదా ప్రచారం చేయడం.

- పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకువెళ్లడానికి లేదా తీసుకురావడానికి ఏ వాహనం లేదా రవాణా సదుపాయాన్ని ఉపయోగించడం.

- పోలింగ్ కేంద్రం వద్ద లేదా సమీపంలో అల్లరి ప్రవర్తన చేయడం లేదా విధి నిర్వహణలో ఉన్న పోలింగ్ అధికారిని అడ్డుకోవడం.

- మరొకరి పేరుతో ఓటు వేయడానికి ప్రయత్నించడం లేదా వేషధారణ చేసి ఓటు వేసేందుకు ప్రయత్నించడం నేరం. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.