08-12-2025 06:46:52 PM
మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు హుస్సేన్..
గుమ్మడిదల: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని గ్రామాలలో అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పని చేసిన నాయకులు తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామాల అభివృద్దే ముఖ్యంగా పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు గుమ్మడిదల మండల జెడ్పిటిసి కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సద్ది విజయ భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా సుమారు 8 నెలలు గడుస్తున్న మండలంలోని గ్రామాల అభివృద్ధి కనిపించకపోవడంతో నిరాశకు గురై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ కండువా కప్పుకొని సొంతగూటికి చేరారు.
కార్యక్రమంలో పటాన్చెరువు బీఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మెట్టు కుమార్ యాదవ్ గడిల శ్రీకాంత్ గౌడ్ గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నాయకులు జి వెంకటేశం గౌడ్ బొల్లారం మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి నక్క వెంకటేష్ గౌడ్ సంతోష్ రెడ్డి హనుమంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చక్రపాణి ఫయాజ్ షరీఫ్ మడుపతి గణేష్ మంగయ్య సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.