09-12-2025 12:00:00 AM
నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సోమవారం ఆయా మండలాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి విడత పోలింగ్ జరుగనున్న నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి, పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని పరిశీలించారు. అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ ను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. నవీపేట్ లో ఎఫ్.ఎస్.టీ బృందం పనితీరును తనిఖీ చేశారు. నియమావళి పక్కాగా అమలయ్యేలా నిఘా కొనసాగించాలని సూచించారు. అబ్జర్వర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.