23 March, 2026 | 3:23 PM

Breaking News

ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •   జగన్నాద్ పూర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించారు   •   మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు సీఎం శుభవార్త   •   అణచివేత ధోరణి వీడి ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి   •   ఓబీసీ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే బాధ్యతలు.. పాల్గొన్న మంత్రి పొన్నం   •   పశ్చిమాసియాలో యుద్ధం.. లోక్‌సభలో మోదీ ఆందోళన   •  

కాళోజీ వాడిలో కొవ్వొత్తుల ర్యాలీ

23-04-2025 08:39 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజివాడి గ్రామంలో బుధవారం రాత్రి ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంగళవారం పహల్గమ్ లో టూరిస్టుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఇలాంటి దాడులు దేశంలో జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతి మొత్తం ఐక్యంగా ఉండి దేశానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.