ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం
01-05-2024 01:10 AM
తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 30, విజయక్రాంతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఆ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని మంగళవారం కొట్టేసింది. నల్లగొండ ఎంపీ సీటుకు వీరబ్రహ్మ రవి, మెదక్ ఎంపీ సీటుకు కల్లు నర్సింలు గౌడ్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో షేక్ తౌఫీక్ వేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో ఆ ముగ్గురు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ డిస్మిస్ చేస్తూ.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.




