4 June, 2026 | 12:41 AM

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

11-04-2026 01:59 PM

 టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ 

కామారెడ్డి,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపూలే గొప్ప సామాజిక సంస్కర్త అని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలను నిర్వహించారు. టీఎన్జీవో ఎస్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిబాపూలే అని అన్నారు. విద్యా ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోగలరు అన్న ఆశయంతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు.

పాఠశాల స్థాపించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం కోసం పోరాడిన సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యోతిబాపూలే 135 వ  జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ఆ మహనీయుని ఆలోచనలను ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు, సహాధ్యక్షులు చక్రధర్, జిల్లా కార్యవర్గ సభ్యు లు గణేష్, అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పవన్  దోమకొండ తాలూకా కార్యదర్శి రమేష్ ,నరేష్, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.