11 April, 2026 | 3:32 PM

Breaking News

ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •  

స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుంది.

11-04-2026 01:51 PM

ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

చిట్యాల, ఏప్రిల్ 11(విజయ క్రాంతి ): స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుందని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  పేర్కొన్నారు. శనివారం  నకిరేకల్  పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే  జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతి కారుడు పూలే అని, వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బాపు పూలే అని తెలిపారు.

సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికులు మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలేఅని, దళిత, బహుజన జనోద్ధరణ కోసం జీవితకాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసింది. తన సహచరి సావిత్రి బాయి పూలేకు విద్యాబుద్దులు నేర్పి దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుంది అని పేర్కొన్నారు. పూలే ఆశయ సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని పునరుద్ఘాటించారు.