16 July, 2026 | 9:00 AM

ఆ సీన్ కోసం రోజంతా ఆకలితో ఉంచారు

07-12-2024 12:07 AM

సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హీరామండి: డైమండ్ బజార్’. సంజయ్ లీలా భన్సాలీ తీసిన తొలి వెబ్ సిరీస్ ఇదే. ఇందులో మనీషా కొయిరాలా, అదితి రావు హైదరీ, సోనాక్షి సిన్హా, రిచా చద్దా తదితరులు నటించారు. తాజాగా అదితి ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  “హీరామండి షూటింగ్ సమయంలో నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడపాల్సి వచ్చింది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల షూటింగ్ సమయంలో సంజయ్ నన్ను ఒకరోజంతా భోజనం చేయనివ్వలేదు. సన్నివేశాలు సహజంగా రావడం కోసం అలా చేశారు. ఆయన చెప్పినదానిని నేను సంతోషంగా ఆచరించాను. ఆకలితో ఉండటం నాకు చాలా సహాయపడింది. ఆయా సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి” అని అదితి వెల్లడించారు.