కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం పారిపోయిండు!
- ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. సభా నియమాలు తెలియదు
- గురుకులాలను వేధిస్తున్న ఫుడ్ పాయిజన్ సమస్య
- విద్యార్థులకు పాముకాట్లు.. ఎలుకల కాట్లు
- థియేటర్‌లో మహిళ చనిపోతే కేసులు పెడుతున్నరు?
- గురుకుల ఘటనలపై ఎందుకు కేసు పెట్టరు: ఎమ్మెల్యే గంగుల
హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి గెలవలేకే పొన్నం ప్రభాకర్ పొరుగు జిల్లాకు పారిపోయి, అక్కడి నుంచి గెలిచాడని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశారు. మొదటిసారి సభకు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు సభా నియమాలు తెలియవని వ్యాఖ్యా నించారు.
విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్లలో విద్యార్థులు మంచాన పడుతున్నారని, పాములు, ఎలుకల కాట్లతో ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వాపోయారు. ఒక థియేటర్‌కు హీరో వచ్చి, తొక్కిసలాట జరి గి.. మహిళ మృతిచెందితే కేసులు పెట్టిన వా రు.. గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. తాను గురుకులాల్లో విద్యార్థినులు ఎదుర్కొన్న కష్టాలపై మంత్రి సీతక్క ప్రసంగిస్తారని భావి ంచానని, కానీ.. మంత్రి వాటి గుర్తించి మా ట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు.
ఉమ్మడి పాలకులు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తెలంగాణ రాకముందు 261గురుకులాలు ఉండగా, వాటి లో కేవలం 7,500 మంది చదివే అవకాశం ఉండేదని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలను 1,029కు పెంచిందని, తద్వా రా వేలాది మంది గురుకులాల్లో చదువుకునేందుకు అవకాశం వచ్చిందని కొనియా డారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమస్యలు మొదలయ్యాయని దుయ్యబట్టారు.






