calender_icon.png 22 January, 2026 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ యూజీ కౌన్సిలింగ్‌లో మైనారిటీ గురుకులాల సత్తా

02-10-2024 01:29:34 AM

హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): నీట్ యూజీ కౌన్సెలింగ్‌లో మైనార్టీ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్ 22 మంది విద్యార్థులు ఉచిత సీట్లు పొందారని తెలిపారు. నీట్ యూజీ పరీక్షకు హాజరైన 206 మంది విద్యార్థులలో 137 మంది (85 మంది అబ్బాయిలు, 52 మంది అమ్మాయిలు) అర్హత సాధించారని చెప్పారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 22 మంది ఉచిత సీట్లు పొందారని, రెండు, మూడో విడత కౌన్సెలింగ్‌లో మరో 50 మంది ఎంబీబీఎస్ సీట్లు పొందుతారని ఆశిస్తున్నామని చెప్పారు.