18 April, 2026 | 3:13 AM

అత్తాపూర్‌లో కారు బీభత్సం

27-06-2025 01:09 AM

- రెండు కార్లతో పాటు బస్సును ఢీకొన్న కారు 

- పలువురికి స్వల్ప గాయాలు

 రాజేంద్రనగర్, జూన్ 26: ఓ కారు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ సమీపంలో ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. అతివేగంగా వచ్చిన కారు రెండు కార్లు, ఒక బస్ ను ఢీ కొట్టి అనంతరం డివైడర్ కు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దింతో ఆగ్రహానికి గురైన స్థానికులు కారు డ్రైవర్ ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రమాదనికి కారణమైన కారులో డ్రైవర్తోపాటు మరో వ్యక్తి కూడా మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. అగ్రహానికి గురైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.