calender_icon.png 14 July, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

27-06-2025 01:08:05 AM

మేడ్చల్, జూన్ 26(విజయ క్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపద సమయంలో పేద ప్రజలకు వరం లాంటిదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రేస్ యాదవ్ అన్నారు. గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకున్న వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేస్తుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గుండ్ల పోచంపల్లి కు చెందిన పులిగిల్ల రాజేశ్వర్ కు రూ.60 వేలు, కొర్రెములకు చెందిన విమలకు రూ.36 వేలు, పోచారం మున్సిపాలిటీకి చెందిన బోదాసు స్వరూపకు రూ.37 వేలు, కొర్రె మూలకు చెందిన ఎన్ కుమార్ కు 32 వేలు, పీర్జాదిగూడకు చెందిన బైరి నచకేత్ కు రూ.60 వేలు, కీసర కు చెందిన బాల్ రెడ్డి, నరసింహ లకు రూ.60 వేలచొప్పున, నక్క ఆండాలుకు రూ.33 వేలు, ఆకిటి సత్తిరెడ్డి కి రూ.39 వేలు, మేడ్చల్ మున్సిపాలిటీ లోని రాయిలాపూర్ కు చెందిన రామన్న గారి జయలక్ష్మి కి రూ.60 వేలు, నడికొప్పు నాగమణికి రూ.37 వేల చెక్కులను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు చెక్కుల మంజూరుకు కృషిచేసిన వజ్రేస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మల్లేష్ గౌడ్, కీసర శంకర్ యాదవ్, కొండల్ రెడ్డి, బాల మల్లేష్, బాగా రెడ్డి, నవీన్, లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.