30 March, 2026 | 9:51 PM

తృటిలో తప్పిన ప్రమాదం

06-05-2024 12:05 AM

అందోల్, మే 5 : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూ ర్ గ్రామ శివారులో నాందేడ్ 161వ జాతీయ రహదారిపై ఆదివారం కారు దగ్దం అయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సంపంగి రమేశ్ టీఎస్11ఈడి5325 కారులో 5మంది ప్రయా ణికులతో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు ప్రయాణి స్తుండగా కారులో ముందు పోగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కారు ను రోడ్డు పక్కన నిలిపి కారులో ఉన్న 5మంది ప్రయాణికులను దింపారు. వారు బయటకు వచ్చిన క్షణల్లోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు పూర్తి గా దగ్దం అయ్యింది. ఇది చూసిన వాహనదారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చెరుకోని మంటలు అదుపులోకి తెచ్చారు. కారు లో ప్రయాణిస్తున్న వారికి ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.