ఎమ్మెల్యే సబిత ప్రజలకు చేసింది ఏమీ లేదు
అందెల శ్రీరాములు యాదవ్..
మహేశ్వరం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారని మహేశ్వరం నియోజవర్గ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాద వ్ అన్నారు. ఆదివారం మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనప్రియ అపార్ట్‌మెం ట్ వాసులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ఎం చేసిందో చెప్పాలన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుం టామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మహేశ్వరం కన్వీనర్ ఎల్మేటి దేవేందర్‌రెడ్డి, సభ అధ్యక్షుడు జీఎస్ గాజుల మధు, కార్పొరేటర్లు బాలకృష్ణ, లీలా రవినాయక్, చెవ్వ శ్రావణ్, వేముల నర్సింహ పాల్గొన్నారు.




