13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కోతుల బెడదకు పాలకవర్గం ప్రాధాన్యం

30-03-2026 09:40 PM

ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతూ పాలకవర్గం తీర్మానం

వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన పాలకవర్గం 2026-27 సంవత్సరానికి గాను 30.69 కోట్ల బడ్జెట్ కు ఆమోదం

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో  నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో హుజురాబాద్ ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోతుల బెడదను తగ్గించేందుకు నాలుగు లక్షల రూపాయలతో 2026-27 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు.  ముందుగా ప్రధాన సమస్య అయిన డంప్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

హుజురాబాద్ పురపాలక సంఘ 2026-27 వార్షిక బడ్జెట్ ను  సోమవారంమున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని అధ్యక్షతన, జూనియర్ అకౌంట్స్ ఆపీసర్ ఆరతి ప్రవేశపెట్టారు.  2026-27 వార్షిక సంవత్సరానికి గాను30.69 కోట్ల బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఈ  సమావేశంలో 26 అంశాలకు గాను 26 అంశాలను ఆమోదించారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి రూ. 7 కోట్ల 50 లక్షలు, మురుగు కాలువల నిర్మాణానికి రూ. 6 కోట్లు, విద్యుత్ స్థంభాలు, లైట్ల కోసం కోటి రూపాయలతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలకు బడ్జెట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే తైబజార్ వేలం వేయగా రూ. 24,21,000 లకు భూం రామకృష్ణ వేలంపాటలో దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, పాలకవర్గ సభ్యులు, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, కార్యాలయ మేనేజర్ భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, టి.పి.ఎస్. అశ్వినీ గాంధీ, సీనియర్ సహాయకులు రమేష్, జూనియర్ అకౌంటెంట్ గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ వినయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.