calender_icon.png 5 July, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి చెరువులో పడిన కారు

12-12-2024 01:11:14 AM

వ్యక్తి దుర్మరణం

మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నర్సంపేట మండలం మదన్నపేటలో బుధవారం జరిగింది. నర్సింహులపేటకు చెందిన ముగ్గురు యువకులు మాదన్నపేట గ్రామంలో శుభకార్యానికి కారులో వెళ్లారు.

తిరిగి వెళ్తున్న క్రమంలో కారు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న యువకుల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.