05-07-2025 01:37:56 AM
హైదరాబాద్, జూలై4(విజయక్రాంతి): స్వాతంత్య్ర సంగ్రామంలో అడవి బిడ్డల కోసం బ్రిటిష్ పాలకులతో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం వీరోచితమని కేం ద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రతి భారతీయుడిలోనూ ఒక హీ రో ఉంటాడన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కేంద్ర ప్రభుత్వం తరఫున అల్లూరి సీతారామరాజు జయంతిని అట్టహాసంగా నిర్వహించారు.
ఈకార్య క్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ బ్రిటిష్ సైనికుడి చేతిలో చనిపోవడం ఇష్టం లేక అల్లూరి సీతారామరాజు గారు తనను తాను కాల్చుకున్నారని, ఆ చర్య కంటే చిరస్మరణీయ మరణం ఏముంటుందన్నారు. మనం సత్యం కోసం నిలబడిన ప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఆధునిక ఆయుధాలు లేకపోయినా గెరిల్లా యుద్ధం ద్వారా బ్రిటిష్ పా లకులతో అల్లూరి పోరాడి అందరినీ ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు. గిరిజన హక్కుల ను కాపాడటానికి, వారిని సాధికారతతో, స్వ యం సమృద్ధిగా చూడటానికి, ప్రధాన స్ర వంతిలోకి తీసుకురావడానికి అల్లూరి చేసిన పోరాటాన్ని ఈ రోజుకు కూడా మన్యం వీరుడుగా స్మరించుకుంటున్నారని తెలిపారు.
దేశంలో అన్ని కులాల మధ్య ఐక్యత కోసం అల్లూరి పోరాడారని, తద్వారా మన దేశం మరింత గొప్పగా ఉంటుందని ఆయన ఆశించారని గుర్తు చేశారు. గిరిజన నాయకుడిగా దేశవ్యాప్తంగా ఆయన వారసత్వం మరువలేనిదని కొనియాడారు.
అల్లూరి ఆదర్శా లను అనుసరించి ఎన్డీయే ప్రభుత్వం కూడా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును తొలి రాష్ర్టపతిని చేసిందని తెలిపారు. గిరిజనుల సాధికారత సాధించడంలో తెలంగాణ, ఏపీ లు ఆదర్శంగా నిలుస్తాయని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నం..
ఆజాద్ చంద్రశేఖర్, అల్లూరి లాంటి ఎం తోమంది యువ యోధులు దేశ స్వాతం త్య్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు విడిచారని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. అల్లూరి పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే కా కుండా దేశం మొత్తానికి గుర్తింపు ఉందన్నా రు. అడవుల నుంచి పుట్టిన పోరాటాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తాల్సి వచ్చిందని, గిరిజనులపై, వారి భూమిపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా గిరిజనులు గౌరవంగా జీవించాలని అల్లూరి పిలుపునిచ్చారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో గిరిజన ప్రాంతాల్లో టూరిజం, విద్య, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, అల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. బాలికల చదువు కోసం పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఆగష్టు 2026లోపు నక్సల్స్ రహిత భారత్
అడవులు నక్సల్స్‌కు అడ్డాగా మారాయ ని, అయితే ఇప్పుడు నక్సల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నారని రాజ్‌నాథ్ సింగ్ ప్రక టించారు. ఆగస్టు 2026 లోపే నక్సల్స్‌ను తుడిచిపెట్టేస్తామని స్పష్టం చేశారు. నక్సల్స్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగం గా జరుగుతోందని, వేగంగా గ్రోత్ కారిడార్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కనీ సం నెట్‌వర్క్ లేని ఆ ప్రాంతాల్లో ఇప్పుడు 8 వేల టవర్లను ప్రారంభించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఐటీఐ, టెక్నికల్ కళాశాలలు గిరిజన ప్రాంతాల్లో ప్రారం భిస్తామన్నారు. ధర్మం కాపాడేందుకు ధైర్యం గా పోరాటాలు చేయాలన్నారు. పహల్గాం దాడి తర్వాత తర్వాత ఆపరేషన్ సిందూ ర్‌తో ధైర్యం, ధర్మం, కర్మను పరిచయం చేశామన్నారు. రామాయణంలో హనుమంతు డు చేసిన పనే ఇప్పుడు మనం చేశామని, మనల్ని ఎవరు చంపారో వారిని మాత్రమే చంపామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే సమాధానం చెబుతామని వివరించారు.
న్యాయం అందరికీ సమానంగా దక్కాలన్నారు. జాతి నిర్మాణం లో గిరిజనుల పాత్ర మరువలేనిదన్నా రు. ఆదివాసీలను సాధారణ జనజీవనంలో కి తీ సుకు రావాల్సిన అవసరముందన్నారు. 50 వేలకు పైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి సంక ల్పాన్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్దామ న్నా రు.
మహానుభావుడు అల్లూరి: కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థకు నూతన జవస త్వాలు అందించి, భారత సైనిక శక్తి ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలియజేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని అనేక స్వాతంత్య్ర సమరయోధులకుచరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయిందని, వారి చరిత్రను యువతరానికి అందించాలన్నదే పీఎం మోదీ ఉద్దేశమన్నారు.
అల్లూరి పూర్తి వివరాలను సేకరించిఅందరికీ తెలియజేసేలా, వారి 125వ జయంతిని ఘనంగా నిర్వహించాలని మోదీ ఆదేశించగడంతో వెంటనే ఆ ఉత్సవాలను ప్రారంభించామని తెలిపారు. అల్లూరి కుటుంబసభ్యులకు కేం ద్రం ఇండ్లను నిర్మించి ఇచ్చిందని వెల్లడించారు. అల్లూరి సంఘ సంస్కర్త, సామాజిక సంస్కర్త అని, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహానుభావుడని కొనియాడారు.
క్షత్రియుడు అంటే భూమి కోసం ప్రాణాలు అర్పించేవాడు: షెకావత్
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ సీతారామరాజు 128వ జయంతిని జరుపుకోవడం హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుందన్నారు. క్షత్రియుడు అంటే తన భూమి కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండేవాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడన్నారు. మాతృభూమి కోసం ప్రాణా లను త్యాగం చేసిన యోధులను మ నం గుర్తుంచుకోవాలన్నారు.
అల్లూరి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న క్షత్రియ సేవా సమితిని అభినందించారు. క్షత్రియ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, ఎంపీలను ఘనంగా సన్మానించారు. రాజ్‌నాథ్ సింగ్‌ను క్షత్రియ సేవా సమితి ఘనంగా సన్మానించిం ది. ఈ సందర్భంగా అల్లూరి జిల్లాలో మంపకొలనును, మొగల్లులో అల్లూరి జ్ఞానమందిరాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.
కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, మాజీ కేంద్ర మంత్రి అశో క్ గజపతి రాజు, ఎ.ఎస్.ఎన్. రాజు, అల్లూరి సీతారామరాజు అవార్డు గ్రహీత డా. ఎ.వి.ఎస్. రాజు, ఎన్సీసీ చైైర్మన్, క్షత్రియ కమ్యూనిటీ ప్రముఖు లు పాల్గొన్నారు.