12-12-2024 01:07:47 AM
కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు గాంధారి ఎస్సై ఆంజనేయు లు ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. బామన్ సజ్జు వద్ద కు బస్సి ప్రకాష్ అనే వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి రెండు కవర్లలో గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.
వారి నుంచి 105 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి మొక్కలు పెంచి, అదే గ్రామానికి చెందిన బస్సి ప్రకాష్ ద్వారా చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారని ఎస్సై తెలిపారు.
బోధన్‌లో అల్ఫాజోలం స్వాధీనం
నిజామాబాద్(విజయక్రాం తి): నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టాస్క్‌పోర్స్ అధికారు లు బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు తరలిస్తున్న నాలుగున్నర కిలోల అల్ఫాజోలం పట్టుబడింది. సిద్దిపేటకు చెందిన నర్సింలుగౌడ్, నవీన్‌గౌడ్, నాందేడ్ జిల్లా అహ్మద్‌పూరాకు చెందిన యాదగిరిగౌడ్‌ను అరెస్టు చేశారు.