calender_icon.png 18 February, 2026 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన భవనంలోకి రాష్ట్ర పన్నుల కార్యాలయం

18-02-2026 12:00:00 AM

సరూర్ నగర్ నుంచి నాంపల్లికి తరలింపు 

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్ (రాష్ట్ర పన్నులు) సరూర్‌నగర్-3 సర్కిల్ కార్యాలయం నూతన ప్రాంగణంలోకి మార్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ (ఎస్‌టీ) బీ.శ్యామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, ఇప్పటివరకు మయూర్ కుశాల్ టవర్స్‌లో ఉన్న ఈ ప్రైవేట్ భవన కార్యాలయాన్ని నాంపల్లిలోని గగన్ విహార్ ఆఫీస్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోకి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ నూతన కార్యాలయాన్ని సరూర్‌నగర్ డివిజన్ జాయింట్ కమిషనర్ (ఎస్‌టీ) పి. నయనార్  లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు.  పన్ను చెల్లింపుదారు లు, సంబంధిత వ్యక్తులు ఈ మార్పును గమనించి ఇకపై పాత భవనానికి కాకుండా నాంపల్లిలోని నూతన కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా ఆయన కోరారు.