17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పర్యావరణ రక్షణకు ‘కేర్’ ప్రతిజ్ఞ

06-06-2025 12:09 AM

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు అనే నినాదంతో ప్రతిజ్ఞకు పూనుకున్నది. పర్యావరణాన్ని కాపాడాలని, బాధ్యతతో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమాన్ని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ విశాల్ మహేశ్వరి ప్రారంభించగా, ఆయనతో పాటు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ సింగ్, క్వాలిటీ, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ చౌరే, సిటివో వినోద్ రామన్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ విన్సీ అశోక్ త్రిబువన్, ప్రాజెకట్స్, ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ శివ కుమార్ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో డాక్టర్లు, ఆసుపత్రుల చీఫ్‌లు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ కలసి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై ఆడిట్, ప్రసంగ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు, గ్రీన్ డెస్క్ డెకరేషన్లు, ప్లాంట్ ఎ మెమరీ కార్యక్రమంలో మొక్కలు నాటారు.

ఈ సంద ర్భంగా విశాల్ మహేశ్వరి మాట్లాడుతూ.. “భవిష్యత్ తరం కోసం స్థిరమైన అభివృద్ధి అవసరం. అది కేవలం లాభాల గురించి కాదు. ప్రకృతి, సమాజం కోసం మనం చేసే పని అంతకంటే ముఖ్యమైనది. కేర్ హాస్పిటల్స్ అన్ని కార్యకలాపాల్లో పర్యావరణ బాధ్యతను కలిపి చేస్తోంది” అని అన్నారు. రాజీవ్ చౌరే మాట్లాడుతూ.. “నాణ్యమైన ఆరోగ్య సేవలలో పర్యావరణం కూడా భాగం. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ అనుకూల పనులను మా బృందం స్వీకరించింది“ అన్నారు.