19-08-2025 02:37:44 PM
స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి నాయకుల కపట దీక్ష
కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్
కమాన్ పూర్: కమాన్ పూర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ మంత్రి శ్రీధర్ బాబు అని, స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి నాయకుల కపట దీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారని కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్ ఎస్ అన్వర్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటికే మండలంలో మెజారిటీ గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మెజార్టీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టింది మీకు తెలికపోవడం సిగ్గుచేటు అన్నారు. తాసిల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణం కోసం పాత భవనాన్ని తొలగిస్తున్న పనులు మీ కళ్ళకు కనబడటం లేదా... అని ప్రశ్నించారు. కమాన్ పూర్ శ్రీపాద రావు విగ్రహం నుంచి పెంచికల్ పేట రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు నాలుగు కోట్లు కేటాయించగా టెండర్ పూర్తి అయిందని, ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో కాంట్రాక్టర్ పనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతున్నదని, దీనిపై రాజకీయమా కాదా అన్నారు.
మరాజాపూర్ లోని మంగపేట బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల ఐదు లక్షలు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. కమాన్ పూర్ పెద్దగా ఉన్న మండలాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరో మీకు తెలియదా..? తప్పు వారు చేస్తే మాపై నిందలా..! అని మండిపడ్డారు. పుట్ట మధు మంథని ఎమ్మెల్యేగా ఉండి మండలాన్ని మూడు ముక్కలు చేసినప్పుడు బిజెపి నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తనను కమాన్ పూర్ జడ్పిటిసి గా గెలిపిస్తే పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ అయ్యి కమాన్ పూర్ మండలాన్ని రాష్ట్రంలోనే మోడల్ మండలంగా చేస్తానని పుట్ట మధు చెప్పి తట్టడు మట్టి కూడా పోయలేదని మండిపడ్డారు. మరి ఇన్ని రోజులు మీ నోర్లు మూతపడ్డాయని ధ్వజమెత్తారు. త్వరలోనే కమాన్ పూర్ క్రాస్ రోడ్డు నుంచి శ్రీపాద విగ్రహం వరకు రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టుతామని, ఆ దిశా మన మంత్రి శ్రీధర్ బాబు చర్యలు చేపట్టాలని తెలిపారు.
టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో మండలాన్ని చిన్న భిన్నం చేసిన బిజెపి నాయకులు ఎందుకు నోరు మెదపలేదని, బిజెపి, బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కయ్యారు కాబట్టే పదేళ్లు నోరు నిలపలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు కపట దీక్షలు మాని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంత్రి శ్రీధర్ బాబు పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి, ఏఎంసి డైరెక్టర్లు దాసరి గట్టయ్య, అబ్దుల్ రఫీక్, జిల్లా కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గడప కృష్ణమూర్తి, మాజీ కో ఆప్షన్ ఎండి. ముస్తాక్, కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి, మల్యాల మహేష్ గౌడ్, నవునూరి నర్సాగౌడ్, చాట్ల రాయమల్లు, బోనాల సత్యం, చాట్ల గట్టయ్య, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.