19-08-2025 02:34:50 PM
ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చదరంగం క్రీడలో రాణించడానికి అవసరమైన సహకారం అందిస్తానని ఎన్ఆర్ఐ గుజ్జ శ్రీనివాసరావు(NRI Gujja Srinivasa Rao) ప్రకటించారు. ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరికి వచ్చిన సందర్భంగా కేసముద్రం, ఇనుగుర్తి మండల వ్యాప్తంగా ఉన్న15 ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలకు 90 చెస్ బోర్డులను అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదరంగం క్రీడ విద్యార్థులకు గెలుపు ఓటముల పట్ల అవగాహన కలిగిస్తుందని, చదరంగం క్రీడ పట్ల ఆసక్తి చూపే విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందిస్తానన్నారు.
ప్రతి ఏటా మండల స్థాయిలో చదరంగం క్రీడా పోటీలు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10, 5,2 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు నీలం దుర్గేష్, సొసైటీ డైరెక్టర్ కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, గుగులోతు వీరు నాయక్, వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారై శ్రీనివాసరావు మంజుల దంపతులను ఘనంగా సత్కరించారు.