calender_icon.png 19 August, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రెయిన్ స్ట్రోక్ తో ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ మృతి

19-08-2025 02:44:20 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న పన్నాటి సత్య ప్రకాష్(59) బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. సత్య ప్రకాష్ కు ఈ నెల 8న బ్రెయిన్ స్ట్రోక్ రాగా, ఆయనను హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు. సత్య ప్రకాష్ మృతదేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సత్య ప్రకాష్ మృతి పట్ల మహబూబాబాద్ జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.