calender_icon.png 19 August, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను వెంటనే తొలగించండి

19-08-2025 03:36:31 PM

హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేని విద్యుత్ కనెక్షన్లను వెంటనే తొలగించాలన్నారు. వైర్లు తొలగింపునకు ఏడాది సమయం ఇచ్చినా కేబుల్ ఆపరేటర్లు స్పందించలేదని, కేబుల్ వైర్లు మూలంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు.