calender_icon.png 19 August, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా కప్-2025.. భారత జట్టు ఇదే

19-08-2025 03:15:03 PM

2025 ఆసియా కప్: ఆసియా కప్-2025 టోర్నమెంట్ కోసం బీసీసీఐ(BCCI) భారత జట్టును తాజాగా ప్రకటించింది. భారత ఆసియా కప్(Asia Cup) జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Captain Suryakumar Yadav) ప్రకటించారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బీసీసీఐ సెలెక్టర్లతో సమావేశం తర్వాత జట్టును వెల్లడించింది. శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయగా, జస్‌ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లకు జట్టులో చోటుదక్కలేదు. 

ఆసియా కప్‌ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. గ్రూప్-1లో భారత్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ ఉండగా.. గ్రూప్-2లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఇక హైవోల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్థాన్.. సెప్టెంబర్ 14న తలపడనున్నాయి. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

2025 ఆసియా కప్ టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

సూర్య కుమార్ యాదవ్(సి), శుభ్‌మన్ గిల్(విసి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(డబ్ల్యుకె), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (డబ్ల్యూకే), హర్షిత్ రాణా, రింకు సింగ్