calender_icon.png 19 December, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ సిటిజన్లకు క్యారమ్స్ పోటీలు

19-12-2025 01:27:47 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 18 : సీనియర్ సిటిజన్ల అనుభవానికి గౌరవంగా, ఉత్సాహానికి వేదికగా, మన్సూరాబాద్లో చరిత్రాత్మక క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ లోని మల్లికార్జున్ నగర్ నార్త్ కాలనీలో ఉన్న సంక్షేమ భవనంలో ఆదర్శ సీనియర్ సిటిజన్ నేతృత్వంలో సీనియర్ సిటిజన్లకు క్యారమ్స్ పోటీలను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తూ, తమ అనుభవాలతో యువతకు ఆదర్శంగా ఉంటున్నారని ప్రశంసించారు. సీనియర్ సిటిజన్లకు క్యారమ్స్ పోటీల ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, వారిని  ప్రోత్సహించడానికి టీటీఏ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదర్శ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు చింతారెడ్డి కృష్ణారెడ్డి, సత్యనారాయణ, రామ్ రెడ్డి, సత్యనారాయణ రావు, విశ్వేశ్వరరావు, రామచంద్రారెడ్డి, ప్రవీణ్ కుమార్, కృపాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.