calender_icon.png 19 December, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా ‘సర్’ అమలు చేయాలి

19-12-2025 01:26:31 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు 

ఎల్బీనగర్, డిసెంబర్ 18 : దేశవ్యాప్తంగా ’సర్’ అమ లు చేయాలని, ఈ వివరాలతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. కొత్తపేటలోని రాజధాని గార్డెన్స్ లో సర్ అమలు అంశంపై సమగ్ర చర్చ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ ప్రసంగంపై ప్రత్యేక చిత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎల్బీనగర్ అసెంబ్లీ ఇన్ చార్జి సామ రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొత్తపేట, బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్లు నాయకోటి పవన్ కుమార్, లచ్చిరెడ్డి హాజరై చిత్ర ప్రదర్శన తిలకించారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు మాట్లాడుతూ.. సర్ అమలు ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం, అభివృద్ధి పనుల అమలును సమర్థవంతంగా చేయడం, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, సంక్షేమ పథకాలు అర్హుల వరకు చేరే విధంగా సర్ అమలు చేయబడుతోంది. కార్యక్రమంలో  రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, బూత్ కమిటీల నాయకులు పాల్గొన్నారు.