28 March, 2026 | 12:17 AM

బెల్టు షాపుల నిర్వాహకులపై కేసు

27-03-2026 10:27 PM

సిద్దిపేట క్రైం: ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు. సీపీ ఆదేశానుసారం జిల్లాలో మద్యం విక్రయాలపై ప్రత్యేక బృందాలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి.  కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మంగోల్ గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు బెల్ట్ షాపులను గుర్తించి, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముష్ణం సురేష్, నర్సింలు అనే ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి గురువన్నపేట గ్రామంలో రెండు బెల్టు షాపుల నిర్వాహకులు బుడిగె రాములు, బ్రాహ్మణపల్లి కనకయ్యలపై కేసు నమోదు చేశారు. వారి నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.