13-06-2025 12:00:00 AM
కోర్టు ఆదేశాలతో గచ్చిబౌలి స్టేషన్‌లో నమోదు
శేరిలింగంపల్లి, జూన్ 12: టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్లు చెల్లించకుండా పబ్ సిబ్బంది పట్ల అసభ్యం గా ప్రవర్తించింది కల్పిక. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని దూషించినందుకు ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫి ర్యాదు చేసింది.
పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించింది అం టూ కల్పికపై ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో గురువారం కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను కోర్టు నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని కోరే అవకాశం ఉంది.