21-09-2025 01:43:00 PM
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుము $100,000 విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, కార్మిక-ఇంటెన్సివ్ రంగాలలో ఇటీవలి 25% సుంకాల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యాన్ని ప్రతిబింబిస్తాయని మండిపడ్డారు.
లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు సంక్షోభంలో ఉండగా, అమెరికాలో చదువుతున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వంతో అవసరమైన చర్చలు ప్రారంభించి, ప్రభావవంతమైన పరిష్కారాలను ముందుకు తీసుకురావాలని తను కేంద్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ ఎస్. జైశంకర్‌ని కోరుతున్నట్లు హరీశ్ రావు తెలిపారు.