30-12-2025 08:53:13 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా మండలంలోని మెల్లకుంట తండా ఉపసర్పంచ్ ఎన్నుకునే సమయంలో పోలింగ్ బూత్ వద్ద గొడవ జరగడంతో అక్కడికి వెళ్ళిన పోలీస్ సిబ్బందిని మహాదేవుని గడ్డ తండాకు చెందిన గ్రామస్తులు పోలీస్ వారి విధులకు ఆటంకం కలిగించి పోలీస్ వారిపై దాడి చేయడంతో మహాదేవునిగడ్డ తండా చెందిన గ్రామస్తులపై ఈ నెల 14వ తేదీన కేసు నమోదు చేసి అందులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై భార్గవ్ రోడ్ తెలిపారు.