30-12-2025 08:27:49 PM
హాస్పిటల్ సానిటేషన్ కార్మికుల విజ్ఞప్తి
మంథని,(విజయక్రాంతి): మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు మాత శిశు హాస్పటల్లో సానిటేషన్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన అక్టోబర్ నెల వేతనాలు ఇప్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో హాస్పటల్ సూపరిండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని ఆస్పటల్, మాత శిశు కేంద్రంలో పనిచేస్తున్న సానిటేషన్ ఉద్యోగ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలని, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలు విడుదల చేసింది.
అందులో అక్టోబర్ నెల వేతనాలు కూడా ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన అక్టోబర్ నెల వేతనాలు కార్మికులకు ఇవ్వాలని అదే విధంగా ప్రతి కార్మికునికి పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటేషన్ ఉద్యోగ కార్మికులు భారత్, రమాదేవి, లలిత, రాజబాబు, సిఐటియు నాయకులు బాబు, రవి తదితరు లు పాల్గొన్నారు.