సారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
20-07-2026 01:56 AM
పాలకవీడు , జూలై 19 : సారాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తినీ పట్టుకొని అతనిపై కేసు న మోదు చేసిన ఘటన ఆదివారం అలింగాపురం గ్రామంలో జరిగింది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అలింగాపురంకు చెం దిన మట్టపల్లి సైదులు అను వ్యక్తి తన హీరో పాషన్ వాహనం పై సారాను తరలిస్తుండగా పట్టుకున్నట్టు తెలిపారు.
తదుపరి ఎక్సైజ్ అధికారి దివ్య వాహనంను సీజ్ చేసి 8 లీటర్ల సారా ను స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. పట్టుకున్న వారిలో కానిస్టేబుల్ సుధాకర్, నాగరాజు డ్రైవర్, ఉపేందర్ , తదితరులు ఉన్నారు.






