రాచమల్ల రామస్వామి జీవితం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం
గరిడేపల్లి , జూలై 19 ః రాచమల్ల రామస్వామి జీవితం ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాలకు అంకితం అని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దోసపాటి భిక్షం అన్నారు. మండలంలోని రాయినిగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచి స్వర్గీయ రాచమల్ల రామస్వామి ప్రథమ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి ఎనలేని సేవను అందించిన రామస్వామి ఆశయాలను ప్రతి ఒక్కరు సాధించాలని కోరారు. రాచమల్ల రామస్వామి పార్టీ నాయకత్వం వహిస్తూనే గ్రామ సర్పంచిగా అనేక సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన నిరంతరం ముందుండి పోరాడేవాడని, కమ్యూనిస్టు పార్టీకి, మనకి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి దోసపాటి సుధాకర్, రాచమల్ల సుధాకర్, రామకృష్ణ, నరసయ్య, గంటా వెంకటేశ్వర్లు, అమరారపు చిన్న వెంకయ్య, అమరారపు రాంబాబు, గుండు లింగరాజు, గుండు అంజయ్య, గంటా లింగయ్య, వార్డు సభ్యులు రాచమల్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






